calender_icon.png 11 January, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సినిమా చేస్తే నాకొక రికార్డు ఉండిపోతుంది

11-01-2026 12:19:49 AM

చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. వెంకటేశ్ కీలక పాత్రతో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ అనిల్ విలేకరులతో పంచుకున్నారు. 

గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ టైమ్‌కి నెర్వస్‌గా ఉంది. -ఈసారి కొద్దిగా రిలాక్స్‌గా ఉన్నా. నెర్వస్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది. దానికి కారణం చిరంజీవి. ప్రీరిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేశాం. ఆ పాటకి చిరంజీవి వేసిన డాన్స్, ఆ ఈవెంట్లో ఆయన ముందు నేను, వెంకటేశ్ చేసిన అల్లరి ఇదంతా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. దీంతో చాలా రిలాక్స్ అయ్యాను. మీసాల పిల్ల, శశిరేఖ.. రెండు పాటలు మెలోడీ సాంగ్స్. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా మళ్లీ మెలోడీ అయితే ఎలా అని ఆలోచించా. మొత్తం షూట్ అయ్యాక లాస్ట్ షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ చేశాం. ఫైనల్‌గా మెగా మ్యాజిక్ జరిగింది.  

నేను సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు వచ్చిందనే మాట వినవస్తోంది. అయితే, అలా ఎక్కువగా ఒక ముద్ర పడటం కూడా మంచిది కాదు.. ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతికొచ్చి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడనే ఫీలింగ్ ఉంటే చాలు. మంచి కంటెంట్‌తో ఎవరొచ్చినా సరే ఆ సినిమాలన్నీ ఆడతాయి. నా విషయంలో నేను ఎంచుకునే జోనర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకు, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు కలిసి వస్తోంది. 

చిరంజీవి కమ్‌బ్యాక్ త ర్వాత అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది లాంటి ఫ్యా మిలీ జోనర్‌ను ఆయన టచ్ చేయలేదు. అది ఎప్పుడూ నాకు మైండ్‌లో ఉంది. ఇది చాలా అద్భుతమైన బ్లాక్‌బస్టర్స్ ఉన్న జానర్. ఈ జానర్‌లో ఆయనకు సినిమా చేయలానే ఆలోచనతో ఈ కథను సిద్ధం చేశాను.

ఇప్పటివరకు రివిల్ చేయని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. కామెడీతోపాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉంటుంది. చిరంజీవి, నయనతార, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వస్తే, వాళ్లు దాన్నెలా హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో చూపించాం. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు. 

చిరంజీవి చేసే అల్లరి, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ప్రేక్షకులందర్నీ ఒక టైమ్ మిషన్‌లో తీసుకెళ్లినట్టు వుంటాయి. ఆయన్ని నటుడిగా, వ్యక్తిగా అభిమానించే అందరూ సినిమా చూసిన తర్వాత వావ్ అంటారనే నమ్మకం వుంది.  

చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషను 20 నిమిషాలు నాన్‌స్టాప్ ఉంటుంది. ఇందులో వెంకటేశ్ కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే ఒక మైనింగ్ బిజినెస్ మాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతి కలిగేలా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మల్టీస్టారర్స్‌ను హీరోలే స్వాగతించడం చాలా గొప్ప విషయం.  

ప్రీ ప్రొడక్షన్, సినిమా జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ కంటే నేనే ఎక్కువ కేర్ తీసుకుంటా. ఎందుకంటే ప్రొడ్యూసర్ తన జీవితాన్ని ఫణంగా పెట్టి సినిమా చేస్తారు. పది రూపాయలు సంపాదించకపోయినా పరవాలేదు కానీ, సేఫ్‌గా బయటపడితే చాలు. లక్కీగా నేను చేసిన నిర్మాతలంతా హ్యాపీ.  

కొత్త సినిమా గురించి -ఇంకా ఏదీ అనుకోలేదు. నేను సినిమా తర్వాత ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నది లేదు. ఈ సినిమా తర్వాత ఒక రెండు వారాలు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నా. నాగార్జునతో ఎప్పుడు సినిమా చేస్తున్నారని -అందరూ అడుగుతున్నారు. నేను అదే ఫీల్ అవుతున్నా. ఆయన తో కూడా సినిమా చేయాలని కోరుకుంటు న్నా. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర కథానాయకులతో సినిమా చేసిన రికార్డు నాకే ఉండిపోతుంది. 

ఇద్దరు బిగ్ స్టార్స్ బ్యాలెన్స్ చేయడం మా మూలు విషయం కాదు. చిరంజీవి, వెంకటేశ్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. దీంతో నాకు అంత కేక్ వాక్ అయింది. ఇద్దరూ కలిసి చేసిన 18 రోజుల షూటింగ్   నా కెరియర్‌లో వెరీ మెమొరబుల్. 

నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి పాటలకు డాన్స్ చేస్తూ పెరిగాను. ఆయన్ని  డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా నా బాల్యంలోకి వెళ్లిపోయాను. ఖచ్చితంగా చిరంజీవి, వెంకటేశ్‌లతో ఒక ఫుల్ లెంత్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తా.