calender_icon.png 12 January, 2026 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ ధరల పెంపు జీవోలతో నాకు సంబంధం లేదు

11-01-2026 12:24:10 AM

గతంలో కానీ, ప్రస్తుతం కానీ రాష్ట్రంలో సిని మా టికెట్ ధరలు పెంచేందుకు తానెప్పుడూ అనుమతి ఇవ్వలేదని సినిమాటోగ్రఫీశాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై విలేకరు లు ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ.. “సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానే శాను. ‘పుష్ప2’ తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరలను పెంచాలంటూ నా దగ్గరకు రావొద్దని చెప్తూనే ఉన్నా. ఆ మధ్య వచ్చిన రెండు సినిమాలు, తాజాగా వచ్చి న సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలూ నా వద్దకు రాలేదు.

అప్లికేషన్ పెట్టుకోవద్దని నేనే చెప్తున్నా. నన్ను ఎవరూ కలవడం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ చనిపో యింది. ఎందుకు పరిష్మన్ ఇచ్చానా? అనిపించింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచబోమని ఆ మరుసటి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఇప్పటివరకూ ఒక్క సంతకం కూడా పెట్టలేదు. నల్గొండకు సంబంధించిన అభివృద్ధి పనులు చూసు కుంటూ, వాటిని సమీక్షించుకుంటూ రాత్రే వచ్చాను. నేను సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు వస్తే, పేద కళాకారుల విషయంలోనే జోక్యం చేసుకున్నా. అంతే తప్ప, టికెట్ ధరల పెంపు జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అన్నారు.