28-01-2026 10:40:11 AM
ములకలపల్లి, (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఇసుక నిల్వలను ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ గుర్తించారు. మండలంలోని ఆనందపురం గ్రామ శివారులో ఐదు ట్రాక్టర్ల మేరకు ఇసుక నిల్వలను అక్రమంగా రవాణా చేయడానికి అక్రమ రవాణా దారులు నిల్వ చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వాటిని గుర్తించి తగు చర్య నిమిత్తం రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు.