calender_icon.png 8 January, 2026 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి అదృశ్యం

05-01-2026 02:05:52 AM

మేడిపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. వివరాల ప్రకారం బుద్ధ నగర్ కాలనీ లో నివసించే జోగిని శివ కృష్ణ, అన్న అయిన జోగిని సాయి కృష్ణ (24) గత ఆరు సంవత్సరాలుగా కలిసి నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి సాయి కృష్ణ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం దొరకపోవడంతో డిసెంబర్ 31 మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శివ కృష్ణ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.