calender_icon.png 9 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహిర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత

05-01-2026 02:07:16 AM

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు రానున్నాయి. కాస్త సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశముందని ఈమేరకు వాతావరణ శాఖ తెలి పింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 11.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు కోహిర్‌లో 6.0, సిర్పూర్‌లో 6.1 డిగ్రీలు నమోదైంది.