05-01-2026 02:04:35 AM
బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లూయీస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుస్తులు, దుప్పట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తామని చెప్పి కాం గ్రెస్ విస్మరించిందన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షే మంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని, రూ.6 వేల పింఛన్‌తోపాటు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లిపిని కనుగొన్న లూయీస్ బ్రెయిలీ జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.