ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివక్ష తగదు
- సమాన పనికి సమాన వేతనం కల్పించాలి
- 25న ఢిల్లీలో మహాధర్నా
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి): ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి పట్ల వివక్షత చూపుతోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం కాచిగూడలో తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంతవరకు అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. ఢిల్లీలో జరిగే మహాధర్నాకి, మిలియన్ మార్చి ఉద్యమానికి పూర్తిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల సాధనకై ఈనెల 25వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేత నం, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాజీస్పీకర్, ఎమ్మె ల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ ఢిల్లీ లో మహాధర్నాకు అండగా ఉంటామన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ 18 శాతం సర్వీస్‌టాక్సీ వసూలు చేయడం దు ర్మార్గం అన్నారు. కార్యక్రమంలో నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ పూలే, ఏఐయుసి కార్యదర్శి ఎం. నరసింహ, బక్క జడ్సన్, క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్విరాజ్, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.






