జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
12-05-2026 12:06 AM
సర్పంచ్ అక్షరా శ్రీనివాస్
దోమకొండ, మే 11(విజయక్రాంతి): దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో సర్పంచ్ అక్షరా శ్రీనివాస్, అధికారుల ఆధ్వర్యంలో జనగణన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ జనగణన సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన వివరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి కుటుంబం సరైన సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.






