22-11-2025 09:46:16 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో ఇన్ పేషెంట్స్, ఔట్ పేషెంట్లు, గర్భిణీ మహిళలకు కాంగ్రెస్ నాయకులు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం గోపాల్, ముత్తె భూమయ్య, దూడము మహేష్, వంగ రామన్న, ఔరగాని మొండి, దామోదర్ గౌడ్, చిలుముల శ్రీనివాస్, మోకాన పల్లి బాలకృష్ణ, తొంగల రవి, జైన శ్రీనివాస్, సంకూరి శంకర్, భానుచందర్, సందెల మల్లేష్, డాకూరి సురేష్, సల్ల సంతోష్, యువజన ఉపాధ్యక్షులు పోచంపల్లి హరీష్, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రాకేష్, బోడ కుంటి సాగర్ తదితరులు పాల్గొన్నారు.