22-11-2025 09:44:56 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ తో పాటు వర్ని, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన నాణ్యత లోపం లేకుండా అధికారులు కాంట్రాక్టర్లు పనులు వెంటనే పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ లోని జల సౌధలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసే విధంగా కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చించారు.వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు. మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు పోచారం తెలిపారు.