15-11-2025 04:54:27 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): నారాయణపురం మండలం వెంకంబావి తండాలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వెంకంభావి తండాకు చెందిన లబ్ధిదారులు పానుగోతు వసంత గోపాల్ 60000, కొర్ర సంతోష్ 38000, కొర్ర సునీత 41500, జరుప్ల జలంధర్ 19000 రూపాయల చెక్కులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ పానుగోతు బాలు నాయక్ అందజేశారు. పేద ప్రజల పాలిట సీఎం సహాయనిధి వరం లాంటిదని, సీఎం సహాయనిధి మంజూరుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకంబావి తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.