15-11-2025 05:34:38 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
కల్వకుర్తి: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి రైతు వేదికలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరతో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపో వద్దన్నారు. ప్రభుత్వం రైతులకు అనుకూలంగా కేంద్రాలలో మద్దతు ధరతో పాటు గోనె సంచులను అందుబాటులో ఉంచిందన్నారు.
వీటితోపాటు సన్నాలకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు ఠాగూర్ బాలాజీ సింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాములు, మార్కెట్ డైరెక్టర్లు రమా కాంత్ రెడ్డి, మసూద్, నాయకులు సంజీవ్ యాదవ్ ,సంతు యాదవ్, సురేష్, భాస్కర్, మహిళా సంఘం సభ్యులు, రెహానా బేగం, జ్యోతి, సుగుణ, సుమతి, మంజు భార్గవి, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.