calender_icon.png 15 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చొరవతో మహారాష్ట్రకు బస్సు సౌకర్యం

15-11-2025 05:43:59 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని, మొగవెళ్లి, కోయపల్లి, గూడెం మీదుగా మహారాష్ట్ర ఆహేరి రూట్‌లో మొదటిసారి బస్ సర్వీస్ ప్రారంభం అయిందనీ బిజెపి నాయకులు తెలిపారు. ఇక నుండి ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు అందరికీ ప్రయాణం సులభం. రైతులు తమ పంట ఉత్పత్తులను, కూరగాయల వ్యాపారులు శని ఆదివారాలు మహారాష్ట్రలో వారసంతలో విక్రయాలు జరిపేందుకు సులభంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే చేసిన మంచి పనికి మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సుకు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయ కొట్టి మహారాష్ట్రకు బస్సు సౌకర్యం ప్రారంభించారు.