15-11-2025 06:02:13 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీకి చెందిన క్రీడాకారులు జోనల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు అకాడమీ బాధ్యులు అల్లం వెంకటేశ్వర్లు, జాడి శేఖర్ తెలిపారు. అండర్ 19 విభాగంలో తోట పున్నం చంద్రు, దుర్గం రోహిత్, గూమాల వినీల్ మహబూబ్ నగర్ లో జరిగే ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. అలాగే అండర్ 17 విభాగంలో కొలిపాక హర్ష,రామటెంకి ప్రియతమ్ ఎంపికయ్యారని వీరు ఆదిలాబాద్ లో జరిగే ఎస్ జి ఎఫ్ జోనల్ పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. అండర్ 14 విభాగంలో సాన సాగ మోక్షిత్, చింత నిప్పుల భువన్, మాచల విహాన్ ఎంపిక ఎంపికైనరని వీరు ఆదిలాబాద్ లో జరిగే ఎస్ జి ఎఫ్ జోనల్ పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను కోచ్ గౌతమ్, ఎం ఎం సి ఏ సభ్యులు అభినందించారు.