15-11-2025 05:49:01 PM
జడ్చర్ల: పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష(భోజనం) చేశారు. స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప ఎల్లపుడూ ఉండాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.