calender_icon.png 15 November, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలు రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి..

15-11-2025 06:07:40 PM

ఇకనుండి ఎకరాకు 10 క్వింటాల పత్తిని విక్రయించవచ్చు

మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ

మునుగోడు (విజయక్రాంతి): కౌలు రైతులు తమ యొక్క వివరాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని తాము పండించిన పంటను తమ ఖాతాలోనే డబ్బులు జమ అయ్యేలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ అన్నారు. శనివారం కొంపెల్లి రైతువేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై, పత్తి రైతులుకు పత్తి అమ్ముకొనుటలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు. పత్తి రైతులు ప్రస్తుతం పత్తిని అమ్ముకోవడానికి కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని మాత్రమే పంట నమ్ముకోవాలని డెమో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.

ప్రస్తుతం ఎకరాకు కేవలం ఏడు క్వింటాలను మాత్రమే సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని ఇకనుండి కొంపెల్లి క్లస్టర్ నందు అధిక దిగుబడులు సాధించిన రైతులు అసౌకర్యం కలవకుండా ఏడు నుంచి 10 క్వింటాళ్ల వరకు పంట ధ్రువీకరణను ఆన్లైన్ ద్వారా సర్టిఫై చేయడం వల్ల రైతులు పండించిన పూర్తి పంటను అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు.

సంప్రదాయ పంటలే కాకుండా పంట మార్పిడి చేస్తూ అధిక దిగుబడులు సాధించాలి..

వ్యవసాయ విస్తరణ అధికారి పి యాదగిరి గౌడ్ 

ఎప్పుడూ సాంప్రదాయం బద్దంగా వేసే పంటలనే కాకుండా పంట మార్పిడి చేస్తూ నీటి వసతి కలిగిన రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడం వలన అధిక లాభాలను పొందవచ్చని భారత దేశ జనాభాకు అనుగుణంగా పామాయిల్ ఉత్పత్తి లేనందువలన విదేశాల నుండి పామాయిల్ ని దిగుమతి చేసుకోవడం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అనుగుణంగా రైతులు అధిక సంఖ్యలో ఆయిల్ ఫామ్ ని సాగు చేయాలని రైతులకు సూచించారు.

పామాయిల్ సాగు ప్రభుత్వం పరికరాలకు,సాగుకు సబ్సిడీ రూపంలో అందిస్తుంది..

పతంజలి మేనేజర్ ప్రసాద్ 

ఎకరానికి 57 మొక్కలను నాటుకోవచ్చని పత్తి వరి పంటల కంటే అధిక లాభాలు రైతుల సాధించవచ్చునని అన్నారు. మార్కెట్ సమస్య కూడా లేదు ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ ఇస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ ద్వారా ఇప్పటికే వేసిన రైతులు ఎకరానికి సుమారు 1 లక్షా 50 వేల వరకు నికర ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్, మానిటరింగ్ ఆఫీసర్ టి రేణుక, సీఈవో పాలకూరి సుఖేందర్ గౌడ్, వేదిరే విజయేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, డైరెక్టర్ ఎం యాదయ్య, పామ్ ఆయిల్ ఫీల్డ్ అసిస్టెంట్ పి స్వామి, రైతులు మక్కెన అప్పారావు, దాం యాదయ్య, వీరమల్ల భాస్కర్, వెంకట్ రాములు జాల వెంకటేశం, యాదగిరి రెడ్డి,ఆళ్ల రాజు, కోటేశ్వరరావు, మల్లారెడ్డి, కోతులారం ఇప్పర్తి గ్రామ రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.