calender_icon.png 15 November, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల తల్లికి 'వీ కెన్ డూ' చేయూత

15-11-2025 06:00:31 PM

హనుమకొండ (విజయక్రాంతి): చదువుల తల్లికి వీ కెన్ డూ స్వచ్ఛంద సంస్థ ఆర్థికంగా చేయూతనిచ్చింది. హనుమకొండ ప్రాంతానికి చెందిన మల్యాల సమత చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తండ్రి ఆదరణకు నోచుకోక, వివిధ ప్రభుత్వ అనాధ శరణాలయాలలో ఆశ్రయం పొందుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే దృడ సంకల్పంతో పీజీ సెట్ 2025 ప్రవేశ పరీక్ష వ్రాసి, అందులో అత్యున్నత ప్రదర్శన కనబరిచి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ నందు ఉచిత సీట్ సాధించింది.

హాస్టల్ వసతి నమోదుకై, కట్టవలసిన ఫీజుకై ఇబ్బంది పడుతూ, వీ కెన్ డూ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించగా సంస్థ సభ్యులు తక్షణమే స్పందించి, ఒక సంవత్సర హాస్టల్ వసతికి సరిపడా పదివేల రూపాయల ఆర్ధిక సహాయంను, బ్యాగ్, నోట్ బుక్స్ ను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుడ్డేటి నరేష్ కుమార్ అందించడం జరిగింది. తాను అడుగగానే తక్షణమే మానవతా దృక్పధంతో స్పందించి సహాయం చేసిన వీ కెన్ డూ సంస్థకు మల్యాల సమత కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. నాగరాజు వాడపల్లి, డా. పాలమాకుల కొమురయ్య, బోయిని రాజేందర్, బోయిని రాధిక, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.