15-11-2025 05:38:29 PM
మాటేటి సంజీవ్, కోడెం అజయ్..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకుసాగాలని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడం అజయ్ లు అన్నారు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను వారు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి 100 మంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, లక్ష్యం దిశగా ముందుకు సాగాలని, టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని అన్నారు.
గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, రాష్ట్రస్థాయిలో విజయం సాధించి మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ టేబుల్ టెన్నిస్ జిల్లా కార్యదర్శి బొల్లి సత్యనారాయణ, అసోసియేషన్ కోశాధికారి గోపికృష్ణ, సహాయ కార్యదర్శి ప్రణయ్, తిరుపతి, పీఈటీలు ఆసియా, శేఖర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.