calender_icon.png 15 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో పంట మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

15-11-2025 05:46:27 PM

బీజేపీ నేతలు..

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ ప్రభావిత పట్టా భూముల్లో పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌ కి వినతిపత్రం సమర్పించారు. వెంటనే అధికారులు పంట పొలాలను సందర్శించి రైతులకు న్యాయం చేయాలని, అలాగే ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించి నిర్వాసితులకు హామీ ఇచ్చిన ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.