calender_icon.png 15 November, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల సాధ్యం

15-11-2025 05:41:27 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో బిఆర్ఎస్ బిజెపిలకు చెంపపెట్టు

తుంగతుర్తి (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన గాదంగి సుజాత, శ్రావణి, ఉమారాణి, మామిడి విజయ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి మాట్లాడారు. వర్షాకాలంలో వీరి కుటుంబాలు నీట మునిగిన పరిస్థితిని తాను స్వయంగా చూసి చలించిపోయానన్నారు. పత్రికల ద్వారా వచ్చిన సమాచారాన్ని చూసి, వెంటనే కలెక్టర్ కు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

అనంతరం నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి, గ్రామపంచాయతీ భవనం నిర్మించడం సంతోషంగా ఉందని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. జూబ్లీహిల్స్లో బిజెపి బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలపన్న, 25 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందుటకు ప్రజలు పట్టం కట్టినట్టు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రేగటి రవి, రేగటి వెంకటేష్, దాసరి శ్రీను, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, కలకోట్ల మల్లేష్, ఉప్పుల రాంబాబు, గంగరాజు, అజయ్ కుమార్,  మాచర్ల అనిల్, ఆకారపు ఎల్లయ్య, తప్పెట్ల శంకర్, భాష బోయిన వెంకన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.