calender_icon.png 15 November, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలందరిపై గోవిందుడి అనుగ్రహం ఉండాలి: కెఎల్ఆర్

15-11-2025 05:00:21 PM

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న లక్ష్మారెడ్డి

మహేశ్వరం: మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీకమాస శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకోవటం తన అదృష్టమన్నారు. స్వామివారి అనుగ్రహం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సహా కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీలు,ఇందిరమ్మ కమిటీలు, ఆలయ కమిటీలు, మహిళా నాయకురాళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.