calender_icon.png 16 September, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ

16-09-2025 07:04:57 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని కార్మిక క్రీడాకారులకు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. జిఎం కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మిక క్రీడాకారులతో పాటు నియర్ బై క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు.  వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025-26 సం.కు గాను ఇండోర్ గేమ్స్, నియర్ బై ఏరియాకి ఎంపికైన క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకొని విజయ తీరాలను చేరుకోవాలని సూచించారు.