calender_icon.png 16 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేప నూనెతో పురుగుల జీవిత చక్రం గుడ్డు దశలోనే అరికట్టవచ్చు

16-09-2025 07:00:36 PM

- పురుగుమందులను మోతాదుకు మించి విచక్షణ రహితంగా పంటలపై పిచికారి చేయకూడదు

- మండల వ్యవసాయ అధికారి పద్మజ

మునుగోడు (విజయక్రాంతి): వ్యవసాయ క్షేత్రాలలో పంటలను ఆశించే పురుగులను వేప నూనెతో వాటి జీవిత చక్రం గుడ్డు దశలోనే అరికట్ట వచ్చునని మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ(Mandal Agriculture Officer Padmaja) అన్నారు. మంగళవారం మండలంలోని పలివెల గ్రామంలో పత్తి, వరి పంటలు సందర్శించి ప్రత్తిలో తామర పురుగు, ఎర్ర నల్ల, పచ్చ దోమ, రసం పీల్చే పురుగులు, కాయ కుళ్ళు తెగులును గమనించి, వాటిని నివారించే సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇథియాన్ 40 శాతం+సైపర్మెత్రిన్ 5 శాతం మందు 2.5 మి.లీ.లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి, వేప నూనె 1500 టిపిఎం 5 మి.లీ. లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పంటలపై పిచ్చుకారి చేయాలని సూచించారు. పురుగు మందుల ను ఎప్పుడూ కూడా మోతాదు కు మించి ,ఇతర బయోలతో కలిపి వాడకూడదు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కె. నిఖిల్ కుమార్, రైతులు గోసుకొండ మల్లేష్, మాదగోని లింగయ్య, గోసుకొండ నరసింహ ఉన్నారు.