20-09-2025 03:03:48 PM
మేడి హరికృష్ణ..
చిట్యాల (విజయక్రాంతి): క్రీడల్లో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని శనివారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ పేర్కొన్నారు. అండర్-14 విభాగం జిల్లా స్థాయి వాలీబాల్, అండర్-17 కబడ్డీ పోటీలకు ఎంపికైన చిట్యాల ఆక్స్ ఫర్డ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అన్వర్, సాయి ప్రణీత్, చేకూరి శ్రావ్యలను హరికృష్ణ సన్మానించారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు లింగస్వామి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.