25-11-2025 04:31:25 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అస్మిత అథ్లెటిక్స్ లీగ్స్ ఈ నెల 28న జిల్లాలో జరగనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడుకోట్నాకా విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గుండం లక్ష్మణ్ తెలిపారు. 14, 16 సంవత్సరాల బాలికలకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి క్యాంపులకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ లీగ్ కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇద్దరు కోచ్‌లు కూడా జిల్లాకు రానున్నట్లు సూచించారు. జిల్లాలోని బాలికలు క్రీడా రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అని నిర్వాహకులు పేర్కొన్నారు.