25-11-2025 12:00:00 AM
482 గ్రామాల్లో కేవలం 19 సర్పంచ్ పదవులు బీసీలకు..
సర్పంచ్ పదవుల్లో బీసీలకు భారీగా కోత
మహబూబాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికై గ్రామానికి సేవ చేయాలనే తలంపుతో ఉన్న అనేకమంది ఔత్సాయిక రాజకీ యవేత్తలకు రిజర్వేషన్లు ఊహించని విధంగా దెబ్బతీసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చాలా చోట్ల రిజర్వేషన్లు తమకు అనుకున్న విధంగా రాకపో వడంతో పోటీకి దూరం కావాల్సి వచ్చిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, 18 మండలాల్లో గూడూరు, ఇనుగుర్తి, కురవి, సి రోల్ , డోర్నకల్, మరిపెడ మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించలేదు.
ఇక కొత్తగూడ, గంగారం, బయ్యా రం, గార్ల మండలాల్లో ఏజెన్సీ కారణంగా పూర్తిగా ఎస్టీలకు సర్పంచి పదవులు కేటాయించడంతో జిల్లా వ్యాప్తంగా 18 మండ లాల్లో 10 మండలాల్లో బీసీలకు ఒక్క సర్పం చ్ స్థానం కేటాయించలేదు. నిన్న మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్లతో రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశించిన వారికి ప్రస్తుత రిజర్వేషన్లు చూసి నిర్గాంత పోతున్నారు.
బీసీ జనాభా అధికంగా ఉన్న కేసము ద్రం మండలంలో కేవలం 2 సర్పంచ్ స్థానా లు కేటాయించగా, నెల్లికుదురు లో 4, మహబూబాబాద్ లో 1, దంతాలపల్లిలో 4, నర సింహుల పేటలో 1, తొర్రూర్ లో 3, చిన్న గూడూరులో 1, పెద్ద వంగరలో 3 సర్పంచ్ స్థానాలను కేటాయించారు. 18 మండలాలు ఉండగా, కేవలం 19 గ్రామాల్లో బీసీలకు స ర్పంచ్ గా పోటీ చేసే అవకాశం ఉండడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.
జనరల్ స్థానాలే దిక్కు!
మహబూబాబాద్ జిల్లాలో 13 మండలాల్లో బీసీలకు, ఎస్సీలకు సర్పంచి పదవుల కు కేటాయింపులో భారీగా కోత విధించడంతో జనరల్ స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
జిల్లాలో 18 మండలాలు ఉండగా, నాలుగు మండలాలను ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించి పూర్తి గా ఎస్టిలకు రిజర్వ్ చేయడంతో, మిగిలిన 14 మండలాల్లో జనరల్ స్థానాలుగా ప్రకటించిన గ్రామాల్లో సర్పంచ్ పదవులకు బీసీలు, ప్రాతినిత్యం దక్కని ఇతర వర్గాలు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనితో జనరల్ స్థానంలో ఇతరులతో తాము పోటీపడి గెలిచే పరిస్థితి లేదని, తమ కేటగిరికి కేటాయి స్తే కొంత అనుకూలంగా ఉండేదని బీసీలు, ఇతర వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వేషన్ల వ్యవహారం పూర్తిగా అసంబద్ధంగా ఉందని, రిజర్వేషన్ల ప్రక్రియను పునః పరిశీలించాలని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.