calender_icon.png 5 August, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ఉచిత బస్ పాసుల పంపిణీ

23-04-2025 12:00:00 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : చంపాపేట డివిజన్ లోని సింగరేణి కాలనీలో మంగళవారం ఆత్మీయ మానసిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు. ఆత్మీయ మానసిక వికాస కేంద్రం  నిర్వహించిన కార్యక్రమంలో మానసిక దివ్యాంగ విద్యార్థులకు ఉచిత బస్ పాసులను ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు లింగాల దశరథ్ గౌడ్, వేణు గౌడ్ పాల్గొన్నారు.