23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎంపీసీ, బైపీసీలో స్టేట్ ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా తమ విద్యార్థులు ఫలితాలు సాధించారని చిక్కడపల్లిలోని న్యూ ఎరా కళాశాల డైరెక్టర్ భాష్యం శ్రావణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో న్యూ ఎరా జూనియర్ కళాశాల రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉన్నదన్నారు.
ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో నూతన 466 మార్కులు, భవాని- 466 బైపిసి, అర్జున్ - 433 ఎంఈసీ, యష్ అగర్వాల్ 481 సిఈసి, వసంత లక్ష్మి-488 మార్కులు సాధించారు. రెండవ సంవత్సరంలో ఎంపీసీ రక్షిత 992 మార్కులు, బైపిసిలో తులసి శావి 980, ఎంఈసీ జాన్వి నాగ్‌పాల్ 975, సీఈసీ స్పందన- 939 మార్కులను సాధించారు. వారిని డైరెక్టర్ డాక్టర్ భాష్యం శ్రవణ్‌కుమార్ అభినందించారు.