calender_icon.png 18 July, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీ

16-07-2025 12:00:00 AM

హనుమకొండ, జులై 15 (విజయక్రాంతి): మంగళవారం హసన్ పర్తి 66వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు జి డబ్ల్యు ఎం సి అందిస్తున్న ఆరోగ్య రక్షణ కిట్లను 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పంపిణీ చేయడం జరిగింది.

అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ‘ పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న కార్మికులు నిజమైన యోధులు - వారి ఆరోగ్యం మనందరి బాధ్యత‘  వారు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలమని  తెలిపారు.

కార్మికుల సేవలను గౌరవిస్తూ, ఆరోగ్య భద్రత పరిరక్షణకు ఈ కిట్లు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్ స్పెక్టర్ భాషా నాయక్, స్థానిక జవాన్లు, స్థానిక పారిశుద్ధ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.