25-11-2025 12:44:47 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి గ్రామపంచాయతీ ప్రాంగణంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఐకెపి కార్యాలయ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆధార్ కార్డు అనుసంధానంతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించినట్లు వారు తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందిస్తామని తెలిపారు.