25-11-2025 11:29:36 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council meeting) ప్రారంభం అయింది. అజెండాలోని 45 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి నవీన్ యాదవ్ హాజరయ్యారు. మాగంటి గోపినాథ్, అందెశ్రీకి జీహెచ్ఎంసీ కౌన్సిల్ నివాళుల్పించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ చివరి సమావేశం ఇది. 2026 ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగుస్తోంది. పలు కీలక అంశాలపై నిరసనకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముదే రసాభస కొనసాగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ లోకి ప్లకార్లులతో వెళ్లారు. కార్పొరేటర్ల వద్ద ఉన్న ప్లకార్డులను మార్షల్స్ లాక్కునేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.