calender_icon.png 8 May, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి బిడ్డల కష్టాలు తీర్చేందుకే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

07-05-2025 12:00:00 AM

రాష్ర్ట పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట, మే 6 (విజయక్రాం తి): పేదింటి బిడ్డల కష్టాలు తీర్చేందుకే ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తుందని రాష్ర్ట పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సూర్యాపేట నియోజకవర్గం లోని 306 మంది లబ్ది దారులకు రూ.3,06,35,496 విలువగల కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అయ్యే ఖర్చులను భరించలేక పేదలు అప్పుల పాలవుతున్నారని, అలా జరగకూడదననే రాష్ర్ట ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్దిక సహాయం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.