07-05-2025 12:00:00 AM
భీమదేవరపల్లి, మే 6 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో ఉద్యాన శాఖ,కే ఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతులు గోపాల్ రెడ్డి ఆయిల్ ఫామ్ క్షేత్రంలో రైతులకు అవగాహన కార్యక్రమo నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ హార్టికల్చర్ అధికారి సుస్మిత మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుచేసే రైతులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుంది అని తెలిపారు.
ఎరువుల, నీటి యజమాన్యపద్ధతులు, డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు, వేసవిలో ఆయిల్ పామ్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది.ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నదని రైతులు సందేహ పడాల్సిన అవసరం లేదని మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలని అన్నారు. ఇంకా 2025-26 సంవత్సరంకు కొత్తగావిస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.
కేన్ బయో సెన్సెస్ డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ సాగు చేసే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 20000 ఉంది అని తెలిపారు.ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన పడవద్దు అనిప్రస్తుతానికి రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎల్కతుర్తి మండలంలోని బావుపేట్ గ్రామంలో ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా ములుగులో నిర్మిస్తామని తెలిపారు. కొత్తగా సాగు చేసే రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్ ఆఫీసర్ మహిపాల్, జైన్ ఫీల్ ఆఫీసర్ శివ రైతులు తదితరులు పాల్గొన్నారు.