18-05-2025 08:36:54 PM
సిపిఎం ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
మహబూబాబాద్,(విజయ క్రాంతి): సమాజంలో వివాహాలు వివిధ రకాలని, అందులో స్త్రీ పురుషులు సమానంగా భావించి కట్న కానుకలు లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు(CPM Politburo member B.V. Raghavulu) అన్నారు. ఆదివారం మహబూబాబాద్ పిఎస్ఆర్ కన్వెన్షన్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య అధ్యక్షతన సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ నాగమణి దంపతుల కుమారుడు ఆకాష్, మహబూబాబాద్ కు చెందిన బొమ్మ వెంకటేశ్వర్లు రోజా రమణిల కుమార్తె అమృత వర్షిని ల ఆదర్శ వివాహాన్ని బీవీ రాఘవులు దగ్గర ఉండి జరిపించారు. వధూవరులుద్దరూ ప్రేమ వివాహం అంగీకరించగా వారి తల్లిదండ్రుల సమక్షంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సాంప్రదాయాలకు భిన్నంగా కమ్యూనిస్టు పద్ధతిలో దండలు మార్చుకొని వివాహ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసి ఆదర్శ వివాహం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో వివాహంలో విభిన్న పద్ధతులు అమల్లో ఉన్నాయన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులు సుఖసంతోషాలతో ఆప్యాయతలు అనురాగంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, నున్న నాగేశ్వరరావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, సిపిఎం నాయకులు జి.రాములు, సూడి కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుర్ణపు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.