03-01-2026 09:34:54 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలోని లింబూర్ గ్రామంలో శనివారం ప్రజలకు సైబర్ క్రైమ్ జరిగే విధానాలు, వాటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే డయల్ 1900 యొక్క ప్రాధాన్యత గురించి ఎస్సై రాజు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అదేవిధంగా, గ్రామంలో ఏదైనా అపరిచిత వ్యక్తులు కనిపించినప్పుడు లేదా ఏదైనా నేర సంఘటన జరిగితే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఈ సందర్బంగా సూచించారు.