26-07-2025 10:15:43 PM
ఐషాని ప్రాజెక్ట్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్..
మంగపేట (విజయక్రాంతి): మండలంలోని కమలాపురం జెడ్పీ పాఠశాలలో 1996-97వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థి లక్ష్మణ్ తన సంస్థ ఐషాని ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ(Aishani Projects Private Limited Company) ద్వారా 25 వేల రూపాయల విలువ గల ప్రింటర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, తాను చదువుకున్న పాఠశాలకు ప్రింటర్ ను బహుకరించడం నాకు చాలా సంతోషంగా ఉందని అలాగే వాటర్ ప్లాంట్ ఇతర సౌకర్యాల కొరకు తన కంపెనీ ద్వారా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలకు ప్రింటర్ ను బహుకరించిన లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు నరసింహారావు, నరేష్, రాజేశ్వరరావు, నాగలక్ష్మి, భూలక్ష్మి, రమేష్ తోపాటు పూర్వ విద్యార్థులు బండారి శ్రీనివాస్, తాళ్లపల్లి హరిబాబు, చింత సురేష్, గడ్డం శ్రీను, మధు, భవిత తదితరులు పాల్గొన్నారు.