26-07-2025 10:13:39 PM
యూత్ కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో..
వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్స్ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..
మంగపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని కస్తూర్బా మహిళా మండలి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు మైల జయరాంరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్స్ లను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కోడెల నరేష్, జిల్లా సొషల్ మీడియ కో ఆర్డినెటర్ కర్రి నాగేంద్రబాబు, మహబూబాబాద్ పార్లమెంట్ స్థాయి మెంబర్షిప్ కొ-ఆర్దినెటర్ కారుపోతుల మణివర్మ, ఎన్ఎస్ యుఐ మండలశాఖ అధ్యక్షులు బోడ జయరాజు, యూత్ ఉపాధ్యక్షులు కుర్సం రమేష్, ప్రధానకార్యదర్శి బాడిషా ఆధినారాయణ, చెట్టుపల్లి ముకుందం, ఐఎన్టియుసి మండలశాఖ అధ్యక్షులు పొల్లూరి తిరుపతి, మండల ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు నైనారపు రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుస్సేన్, యూత్ సీనియర్ నాయకులు బాసరికారి నాగార్జున, లిక్కి రమేష్, కస్ప ముకుందం తదితరులు పాల్గొన్నారు.