25-10-2025 05:19:55 PM
రాజాపూర్: మండలంలోని తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్యాడ్స్ పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చించొడ్ అభిమన్యు రెడ్డి కూతురు హన్విక పుట్టినరోజు సందర్బంగా ప్రాథమిక పాఠశాల చదువుతున్న 70 మంది విద్యార్థులకు అభిమన్యు యువసేన నాయకుడు ఎన్నం కుమార్ ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్, మాజీ డిప్యూటీ సర్పంచ్ శంకర్ నాయక్, మాజీ సర్పంచ్ కుమారుడు వెంకట్రాములు సలాం పాషా, మల్లేష్, లింగయ్య, నారాయణ, రహమద్, శేఖర్, రాజు నాయక్, లింగం, లాస్కర్ శ్రీధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.