calender_icon.png 26 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

25-10-2025 05:22:43 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ స్పష్టం చేశారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జాబ్ కార్డులున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని సూచించారు. నర్సరీలలో మొక్కలను సంరక్షించే చర్యలు చేపట్టాలని సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీరేందర్, రాజేష్, రమేష్, సురేష్ ఉపాధి హామీ పథకం ఈసి మధు, టిఎలు రాజన్న, కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు లింగయ్య, సత్యనారాయణ రాజేందర్ లు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..

మండలంలోని పులిమడుగు గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎంపీడీవో రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.