01-08-2025 01:22:16 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేనీ (ముజీబ్) ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్ దవా ఖాన ఆవరణలో సుమారు 600 మంది రోగులకు గురువారం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి పాత బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్రి, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముఖీ మ్ ఖురేషి, టీఎన్జీవో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బీ శివకుమార్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్వో అహ్మ ద్ వహీద్, మిత్రులు సయ్యద్ మహమ్మద్ కామ్రాన్, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తాఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ.. కీర్తిశేషులైన తన తల్లిదండ్రుల జ్ఞాపకార్తం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆయా సేవాకర్యక్రమాలకు సాయ మందిస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులకు ముజీబ్ కృతజ్ఞతలు తెలియజేశారు.