calender_icon.png 23 November, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీరల పంపిణీ

23-11-2025 04:32:55 PM

లక్షెట్టిపేట టౌన్ (విజయక్రాంతి): పోడేటి వెంక గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఆదివారం చీరలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సేవలు అభినందనీయమని అన్నారు. కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్  కుటుంబ ఆత్మీయుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పోడేటి వెంక గౌడ్ సేవలను సమాజంలోకి ఇంకా ముందుకు తీసుకువెళ్లి సేవలు చేయాలని  సూచించారు.

అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోడేటి వెంక గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సతీష్ గౌడ్, సాయిరాం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ బాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ కౌన్సిలర్లు,  ఓరుగంటి శ్రీకాంత్, మెట్టు రాజు, కళ్యాణి, సిహెచ్ రాజన్న, చుంచు చిన్నయ్య, పాదం శ్రీనివాస్, కో ఆప్షన్ నూనె ప్రవీణ్,  శ్రీకాంత్, చాంద్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.