calender_icon.png 23 November, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

23-11-2025 04:34:59 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఇస్లాం నగర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం ఇస్లాం నగర్ అన్ని వర్గాల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.ఆదివారం వేములవాడ పట్టణంలోని ఇస్లాం నగర్ కు చెందిన సుమారు రెండు మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సుమారు ఇప్పటి వరకు 200 కోట్లు ఉచిత ప్రయాణలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తుందని అన్నారు. ఇస్లాం నగర్ ప్రజలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.నేటీ నుండి వారి బాగోగులు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం అందజేసే పథకాలకు ప్రజలకు చేరవేసేలా చూడాలని సూచించారు.త్వరలోనే ఇస్లాం నగర్ లో కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు..పలు డ్రైనేజీ సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు…