23-11-2025 04:36:39 PM
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ ను ఢీకొట్టిన బైక్
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ నంబర్ 1618 వద్ద వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాలు... కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్, టెలిఫోన్ కాలనీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు స్నేహితులు మధు, హరీష్ ఇద్దరు స్నేహితులు.
వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లిన ఇద్దరి శనివారం రాత్రి బైక్ పై ఇంటికి వస్తుండగా విక్టోరియా మెమోరియల్ స్కూల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న 1618 నెంబర్ వద్ద రోడ్డు డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మధు, హరీశ్ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.