23-11-2025 04:25:47 PM
మఠంపల్లి: మల్లెతీగ సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కార్టూనిస్టులు కళాకారుల సమ్మేళనంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు మొదటి రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనంలో పాల్గొన్న మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి గాయకుడు కర్ల శ్రీనివాస్ కు ఘనంగా ప్రశంసా పత్రం షీల్డ్ శాలువాతో ఘనంగా సత్కారించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన తెలుగు కళాభిమానులు 450 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ల శ్రీనివాస్ కు మఠంపల్లి గ్రామస్తులు స్నేహితులు బంధువులు అభినందించారు.