calender_icon.png 19 May, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు చీరల పంపిణీ

12-05-2025 01:44:11 AM

  1. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహణ
  2. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని బీకేగూడ ప్రాంతంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 80 మందికి ఎత్తు, బరువు, బీపీ, రక్తపోటు, మధుమేహం, ఎస్పీఓ2, హెమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందించారు.

దాంతోపాటు శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు, ఆస్టర్ డీఎం ఫౌండేషన్ సంయుక్తంగా 300 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఫైనాన్స్ విభాగాధిపతి జె ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.