calender_icon.png 19 May, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం

19-05-2025 10:36:06 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చేరుకోనున్న రేవంత్ ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ.12,600 కోట్లతో ప్రారంభించనున్న ఈ పథకం రాష్ట్రంలోని పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైనా ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా 2.1 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసి మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్ గుర్తింపు, 2.5 ఎకరాలు దాటితే సమీప రైతులను కలిపి బోర్ వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేసింది. ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను ప్రభుత్వం గుర్తించి జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే చేయనుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూములు అభివృద్ధి చేసి బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. తొలి ఏడాది 10 వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలకు వర్తిస్తుంది.