calender_icon.png 13 May, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నారసింహుడి జయంతి

12-05-2025 01:42:16 AM

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వేడుకలు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, మహా వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్‌కు మహా అభిషేకం, నారసింహ హోమం, శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామివారి కళ్యాణోత్సవం, ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహాఅభిషేకం నిర్వహించారు.

ఉంజల్ సేవ, పల్లకీ సేవ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య శాంతి, ఐశ్వర్యాల కోసం నరసింహ హోమం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహా అభిషేకం జరిగింది. పంచామృతం, పంచగవ్య, ఫలరసాలు, ఔషద్రాలు, నవరత్నాలు, దేశంలోని పవిత్ర నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం చేయడం విశేషం.

ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌరచంద్ర దాస్ (ఎంటెక్, ఐఐటీ చెన్నై) ప్రత్యేక ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ‘ఆవయం‘ అనే ప్రత్యేక మార్గదర్శిత మంత్రజప కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పిల్లలు, తల్లిదండ్రులు కలిసి నరసింహ మంత్రాలను జపించారు. ఈ ఉత్సవాలకు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.