19-05-2025 11:05:10 AM
మంథని,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాల్లో భాగంగా 5వ రోజు సోమవారం కాళేశ్వరంలో శ్రీశ్రీ సంవిదానంద సరస్వతి, మహా మండలేశ్వర స్వామీజీ కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. సరస్వతి ఘాట్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామిజీని సత్కరించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.