19-05-2025 11:09:30 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): లోక్ సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో పనిచేసిన తహసిల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ప్రభుత్వం ఇటీవల తిరిగి వారిని సొంత జిల్లాలకు పంపింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు కేటాయించిన తహసిల్దార్లకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పోస్టింగ్ ఇచ్చారు.
ఇందులో కేసముద్రం తహసిల్దారుగా జీ.వివేక్, నెల్లికుదురుకు సిహెచ్. నరేష్, గూడూరుకు ఎన్. నాగభవాని, నరసింహులపేటకు జీ.రమేష్ బాబు, డోర్నకల్ కు ఏం. ఇమ్మానుయేల్, సీరోల్ కు ఏ.పూర్ణచందర్ ను నియమించగా ఈ మేరకు వారు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే జిల్లాలో పలువురు తహసీల్దారులను కలెక్టర్ బదిలీ చేశారు. ఇందులో చంద్ర రాజేశ్వర్ గూడూరు నుండి మహబూబాబాద్ కు, సిహెచ్. నాగరాజు నర్సింహులపేట నుంచి బయ్యారం, బి.విజయ బయ్యారం నుంచి కురవి, కే. రాజు నెల్లికుదురు నుంచి కొత్తగూడకు బదిలీ అయ్యారు.