calender_icon.png 19 May, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్‌లూ.. పారాహుషార్!

19-05-2025 01:45:56 AM

అన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా?.. చట్టం పరిధిలోనే పనిచేస్తున్నామా?.. ప్రజా ప్రయోజనం చేకూరుతోందా?.. లేదా ప్రభుత్వ పెద్దలతోపాటు తాముకూడా స్కాముల్లో కూరుకుపోయే లా ఉన్నామా అనేది ఐఏఎస్ అధికారులు తరచూ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అంశమే.

ఇది పరిశీలించుకోకపోతే.. తరువాతి కాలం లో రాజకీయ నాయకులు సరేసరి.. ఐఏఎస్ అధికారులే అప్రదిష్టపాలు కావాల్సి వస్తుంది. పైగా కేసులు, అరెస్టులు, కోర్టుల విచారణలు.. ఆఖరికి శిక్షలు.. వీటన్నింటినీ ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సిన దుస్థితి ఐఏ ఎస్‌లకు రాకూడదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్థంభమైన పరిపాలనకు కేంద్ర బిందువు అఖిల భారత సర్వీసు అధికారులు. రాజకీయ ప్రస్థానంలో నేత ల మాటలన్నింటికీ తలూపుతూ.. జీహుజూర్ అంటూ ముందుకెళితే.. భవిష్య త్తులో తాడే పామై కరవక మానదనేది మన కండ్లముందే కనపడుతూ వస్తోంది.

తాజాగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ఒక వెలుగు వెలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డిని లిక్కర్ స్కాం కేసు లో సిట్ పోలీసులు అరెస్టు చేయడం.. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలతో ఎలా  వ్యవహరించాలి.. ఎలా వ్యవహరించకూడదు అనేదానిపై అందరిలోనూ మరోసారి చర్చను రేకెత్తిస్తోంది.

రాజకీయంగా మాస్టర్‌మైండ్ అనబడే ప్రభుత్వ పెద్దలతో  పరిపాలనా పరమైన చర్యలు తీసుకునేటప్పుడు, పా లసీల తయారీ, అమలులో ఐఏఎస్ అధికారులే కీలకపాత్ర పోషిస్తారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో అన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా?.. చట్టం పరిధిలోనే పనిచేస్తున్నామా?.. ప్రజా ప్రయోజనం చేకూరుతోందా?.. లేదా ప్రభుత్వ పెద్దలతోపాటు తాముకూడా స్కాముల్లో కూరుకుపోయేలా ఉన్నామా అనేది ఐఏఎస్ అధికారులు తరచూ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అంశమే. ఇది పరిశీలించుకోకపోతే.. తరువాతి కాలంలో రాజకీ య నాయకులు సరేసరి.. ఐఏఎస్ అధికారులే అప్రదిష్టపాలు కావాల్సి వస్తుంది. పైగా కేసులు, అరెస్టులు, కోర్టుల విచారణలు.. ఆఖరికి శిక్షలు.. వీటన్నింటినీ ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సిన దుస్థితి ఐఏఎస్‌లకు రాకూడదు.

గుజరాత్ రాష్ట్రంలో 2011లో భూకేటాయింపుల స్కాంపై కేసు నమోద య్యింది. కచ్ జిల్లాలో 2004లో కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రదీప్‌శర్మ ఈ భూకేటా యింపుల స్కాం కేసును ఎదుర్కొన్నారు. అప్పటి భూ కేటాయింపుల్లో కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్టుగా కోర్టు నిర్ధారించి.. ఐదేండ్ల కఠిన కారాగార శిక్షను తాజాగా విధించింది. రిటైర్డ్ అయినప్పటికీ.. గతంలో చేసిన తప్పులకు సదరు ఐఏఎస్ అధికారి శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇదొక్కటే కాదు.. ఒబులాపురం మైనింగ్ కేసులో ఏపీలో గతంలోని ప్రభుత్వ పెద్దలతో అంటకాగి మైనింగ్ కేటాయింపుల్లో నిబంధనలను పక్కనపెట్టి అస్మదీయులకు లాభం చేకూర్చేలా గా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా శిక్షార్హురాలని కోర్టు నిర్ధారించింది.

ప్రస్తుతానికి శిక్షను పక్కనపెట్టి నప్పటికీ.. గడిచిన కొన్ని ఏండ్లుగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పడిన మనో వేదన, కష్టం, ఆమె కెరీర్‌కూడా నడిసంద్రంలో నావలా మారడం మన కండ్ల ముందే కనపడుతోంది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. 

ఈ నేపథ్యంలో.. అసలు ఐఏఎస్ అధికారులు చట్టానికి, రాజ్యాంగానికి బద్ధులు గా వ్యవహరించాలనే చర్చ మరోసారి మొదయ్యింది. తమ వ్యవహార శైలి, తాము రాజకీయ మాస్టర్‌లు అయిన ప్రభుత్వ పెద్దలకు అణిగిమణికి ఉండాల్సిన అవసరం లేదనేది ఐఏఎస్ అధికా రులు తెలుసుకోవాలి.

పాలసీల రూపకల్పన, అమలు విషయంలో చట్టం, నిబం ధనల ప్రకారం వ్యవహరించకపోతే.. భవిష్యత్తులో అవి తమ మెడకు చుట్టుకుం టాయని.. రిటైర్ అయినా వదలవనే విషయాన్ని ఈ సందర్భంగా ఐఏఎస్‌లు గ్రహించాల్సిన సమయం ఇది. ప్రతి ఐదేండ్లకు ఒకసారి మారే రాజకీయ పార్టీల ప్రభుత్వాల వల్ల తాము ఎప్పటికైనా ఇరకాటంలో పడతామని తెలుసుకో వాలి.

కేసులు, విచారణలు, జైళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించుకోవాలి. రాజకీయ మాస్టర్ మైండ్‌లు ఏం చెబితే గుడ్డిగా తలూపకుండా.. చట్టం పరిధిలో, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారిగా జీవితాన్ని సంతృప్తికరంగా అనుభవించొచ్చు.

లేదా రాజకీయ మాస్టర్ మైండ్ లకు అనుకూలంగా వ్యవహరిస్తే.. మరో ప్రభుత్వం వచ్చినప్పుడు షరా మామూ లే.. కేసులు, కోర్టులు, విచారణలు.. చేసిన తప్పులకు జైలు పాలవడం తప్పదు. అందుకే ఐఏఎస్ అధికారులు పారా హుషార్.. మీ వ్యవహార శైలిని మీరే పునఃపరిశీలించుకోవాలి.